ఆమెకి ప్రేమ ఒక చేదు జ్ఞాపకం

ఈ మధ్య టాలీవుడ్‌లో దూసుకుపోతున్న అందాల ముంబాయి ముద్దుగుమ్మ శ్రద్దాదాస్, హిట్టూ, ఫ్లాపులతో సంబంధంలేకుండా ఈమెకు తెలుగులో వరసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ప్రేమ గురించి నీ అభిప్రాయమేంటి శ్రద్ధా అంటే, దానికామె చెప్పిన సమాధానం ఇదిగో ఇలా ఉంది. "ఈ ప్రేమ, దోమ అన్నీ ట్రాష్. ఎదుటి మనిషిని అవసరానికి వాడుకోవాలనుకునే మనుషులు వాడే పదాలు. నేడు ఈ ప్రేమ అనే పదం స్వార్థంతో నిండిపోయింది. ప్రేమలో స్వార్థముంటే అది ప్రేమ ఎలా అవుతుంది. ఇప్పుడు నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది. నేను నా కాలేజీ లైఫ్ లో చూసిన, విన్న ప్రేమ కథలన్నీ చేదు జ్ఞాపకాలే. అందుకే నేను పెద్దలు కుదిర్చిన పెళ్ళే చేసుకుంటాను" అని అంటోంది శ్రద్ధా దాస్. నమ్మొచ్చంటారా...?

More Telugu Cinema News, Reviews & Gossips

DISCLAIMER: Photos and other content are used from other sites & magazines . All credit goes to the actual site owners. We copied photos and links from other websites. We hold no responsibility for any illegal usage of the content.