నిఖిల్‌ తో జతకడుతున్న శ్వేతాబసు

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "హ్యాపీడేస్" చిత్రంలో నటుడిగా పరిచయమై, పరశురామ్ దర్శకత్వంలో, "యువత" చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన నిఖిల్‍ కొత్త చిత్రం జూలై రెండవ వారంలో ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రాన్ని సాయికృష్ణా ప్రొడక్షన్స్ పతాకంపై గతంలో నితిన్ హీరోగా, ప్రియామణి హీరోయిన్‌గా "ద్రోణ" చిత్రాన్ని నిర్మించిన దమ్మాలపాటి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో "కొత్తబంగారు లోకం, రైడ్'' చిత్రాల్లో నటించిన యువ హీరోయిన్ శ్వేతాబసుప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంతో సురేష్ అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నాడు.ఈ చిత్రం జూలై రెండవ వారంలో ప్రారంభం కానుందని తెలిసింది

More Telugu Cinema News, Reviews & Gossips

DISCLAIMER: Photos and other content are used from other sites & magazines . All credit goes to the actual site owners. We copied photos and links from other websites. We hold no responsibility for any illegal usage of the content.