స్క్రిప్ట్ లేకుండా ఇదీ విషయం అని చెపితే ప్రోగ్రాంని రక్తి కట్టించగల సమర్థురాళ్ళైన యాంకర్లు తెలుగులో ఝాన్సీ, ఉదయభాను, సుమ మాత్రమే ఉన్నారు. వీరిలో ఉదయభాను పని రాక్షసి. చేయించుకోగల దమ్ముండాలే కానీ రోజుకి అరడజను ఎపిసోడ్లు కూడా అవలీలగా చేసేస్తుంది. అలాంటి ఈ స్టార్ యాంకర్ ఉదయభాను ఈ మధ్య కొత్తలవాటు చేసుకుంటోందట. అదేంటంటే తాను చేసే ప్రోగ్రామ్స్ కి ఎవేవో కంపెనీలు చీరలు స్పాన్స్ ర్ చేస్తాయి ఆ చీరలు చాలా కళాత్మకంగా ఉంటాయి... అలాగే వాటి ఖరీదు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వాటిని చూస్తూ చూస్తూ వదిలి వెళ్ళటానికి ఉదయభానుకి మనసొప్పటం లేదట. అందుకని వాటిని విడవకుండానే ఇంటికి వెళ్ళిపోతోందట. ఇంటికి తీసుకెళ్ళిన ఆ చీరలనేం అడుగుతాంలే అని వారు కూడా ఊరుకుంటున్నారట. గతంలో ఒక పెద్ద మహానటుడికి ఈ అలవాటుండేదని విన్నాం. ఇప్పుడు ఉదయభాను ఆయన్ని అనుసరిస్తున్నమాట.
DISCLAIMER: Photos and other content are used from other sites & magazines . All credit goes to the actual site owners. We copied photos and links from other websites. We hold no responsibility for any illegal usage of the content.