నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవడు, యువ సామ్రాట్ నాగార్జున మేనల్లుడు అయిన యువ హీరో సుమంత్ గత యేడాది "తొలి ప్రేమ'' హీరోయిన్ కీర్తిరెడ్డిని వివాహం చేసుకున్నారు. కానీ పెళ్ళయిన యేడాది తిరక్కుండానే వారిద్దరూ ఎవరికి వారుగా విడిపోయారు.ఆ తర్వాత ఛార్మిని సుమంత్ వివాహం చేసుకుంటున్నాడని వినపడింది. ఆ తర్వాత కమలినీ ముఖర్జీని అతను పెళ్ళి చేసుకుంటాడన్న రూమరొచ్చింది. కానీ ఇవేవీ జరగలేదు కానీ, సుమంత్ మాజీ భార్య కీర్తి రెడ్డి మాత్రం బెంగుళూరులో ఉంటూ తన మనసుకు నచ్చిన వరుణ్ణి వెతుక్కుందనీ, త్వరలోనే వాళ్ళిద్దరికీ వివాహం జరుగబోతుందనీ అభిజ్ఞవర్గాల భోగట్టా.
DISCLAIMER: Photos and other content are used from other sites & magazines . All credit goes to the actual site owners. We copied photos and links from other websites. We hold no responsibility for any illegal usage of the content.