దయచేసి అపార్థం చేసుకోకండి. కడుపంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ కాదు. ఓన్లీ పొట్ట మాత్రమే. అంటే శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న నూరవ చిత్రం, కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న "మహాత్మ'' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న భావన పర్స్ నాల్టీ చూసిన దర్శకుడు కృష్ణ వంశీ హీరోయిన్‌తో "నీ పర్స నాల్టీ ఒ.కె. కానీ ఆ పొట్టే కాస్త తగ్గించాలి'' అని అన్నారట. అది విన్న హీరోయిన్ భావన ఇక అదే పనిగా జిమ్‌లో జేరి తన పొట్ట తగ్గించుకునే ప్రయత్నం చేస్తూంది. అంతా సినిమా హీరోయిన్ అవటం కోసం జిమ్‌లో జేరతారు. కానీ భావన మాత్రం హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత జిమ్‌లో జేరింది. నేటి కాంపిటీషన్ ప్రపంచంలో నిలబడాలంటే ఆ మాత్రం శ్రమపడక తప్పదు మరి.
DISCLAIMER: Photos and other content are used from other sites & magazines . All credit goes to the actual site owners. We copied photos and links from other websites. We hold no responsibility for any illegal usage of the content.