నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్గా నటించి, అనతి కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర హీరోలందరి సరసనా హీరోయిన్గా నటించి, రాణించిన ఆర్తి అగర్వాల్ ఒక సంవత్సరం క్రితం పెళ్ళిచేసుకుంది. పెళ్ళిచేసుకోగానే భర్తతో పాటు అమెరికా వెళ్ళిపోయి చక్కగా కాపురం చేసుకుంటుంది కదాని అనుకుంటూండగానే గొడక్కొట్టిన బంతిలా ఇటీవల అగర్వాల్ ఇండియాకి తిరిగి వచ్చింది. నన్ను చూడు నా అందం చూడు, సన్న బడ్డాను అంటూ ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టి తెలిసిన వాళ్ళందరికి ఫోన్లుచేసి వేషాలు అడుగుతూందట. అంతే కాదు ఐటం సాంగ్స్లోనైనా నటిస్తానంటుందని సమాచారం. వివాహితగా ఉండే గుర్తింపు కంటే ఒక స్టార్‌కు ఉండే గుర్తింపు చాలా ఎక్కువ. ఆ గ్లామర్, ఆ గుర్తింపు కోసమే ఆర్తి అగర్వాల్ తన పెళ్ళిని పెటాకులు చేసుకుందని సినీ వర్గాలంటున్నాయి.
DISCLAIMER: Photos and other content are used from other sites & magazines . All credit goes to the actual site owners. We copied photos and links from other websites. We hold no responsibility for any illegal usage of the content.