ఆ మధ్య ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఒక సినిమా పత్రిక పెట్టబోతున్నారని ఫిలిం నగర్లో బాగా వినపడింది. అయితే అది నిజమేనని అనటానికి కొంత వరకూ ఆధారాలు లభించినట్టే. ఆ సినిమా పత్రిక అల్లు అరవింద్ కనిష్ట పుత్రుడు, యువ హీరో అల్లు అర్జున్ తమ్ముడు అయిన అల్లు శిరీష్ ఆధ్వర్యంలో నడుస్తుందని తెలియవచ్చింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఒక పత్రికను నడపడమంటే మాటలు కాదు. అది ఆషామాషీ వ్యవహారం కూడా కాదు. కానీ శిరీష్ మామూలు కుర్రాడు కాదు. అతనేదన్నా అనుకున్నాడంటే అది సాధించే వరకూ నిద్రపోడు. ఇప్పటికే భూమిక భర్త భరత్ఠాగూర్ "మాయానగర్" అనే సినీ పత్రికను ప్రారంభించి నడుపుతున్నాడు. ఇబ్బడి ముబ్బడిగా అవసరానికి మించి సినీ పత్రికలున్న సమయంలో శిరీష్ పత్రికను ప్రారంభించటం కొంచెం ఇబ్బందే సుమా.
DISCLAIMER: Photos and other content are used from other sites & magazines . All credit goes to the actual site owners. We copied photos and links from other websites. We hold no responsibility for any illegal usage of the content.