ఒకరి ఆచారం; ఇంకొకరి ఆదాయం.కొందరు స్థిరపడ్డం ; కొందరు డిస్టర్బ్ అవ్వటం.ఓ తండ్రికి బరువు; ఓ అన్నయ్యకి బాధ్యత ఓ కుర్రాడి సర్వస్వం; ఓ అమ్మాయి స్వప్నం ఓ తాతయ్య చివరి కోరిక ఓ బామ్మ చిరకాలపు దప్పిక కొందరి అవివేకం; ఇంకొందరి ఆనందం కొందరు అడ్జస్ట్ అవ్వటం కొందరు అలవాటు పడ్డం కొందరు తృప్తి పడాలనుకోవటం కొందరు తొందరపడ్డాం అనుకోవటం ఒకరు ఉద్యోగం కోసం ఒకరు పిల్లల కోసం ఒకరు స్టేటస్ కోసం ఇంకొకరు వంట మనిషి కోసం కొందరికి జీవితం బోర్ కొట్టినందుకు ఇంకొందరికి ఎవరో ఛీ కొట్టినందుకు కొందరు ఇల్లు వదిలేయడానికి ఇంకొందరు ఏకంగ దేశమే వదిలేయడానికి ఇలా చెప్పుకుంటూ పోతే పెళ్ళి చేసుకోవటానికి ఉండే రకరకరల కారణాలు, నిజానికి ఈ ప్రపంచంలో జరిగిన అన్ని పెళ్ళిళ్ళకంటే ఎక్కువ. మన ఫ్రెండ్, అన్న, తమ్ముడు, నచ్చక పోతే మనం విడాకులు తీసుకోలేం, కానీ జీవిత భాగస్వామి నచ్చకపోతే విడాకులు తీసుకునే సౌకర్యం ఉన్న ఏకైక బలమైన (హీన్) బంధం వివాహ బంధం.సుమారు ఐదువేల సంవత్సరాలుగ ప్రపంచ వ్యాప్తంగ కొన్ని కోట్లమంది కుల, మత, జాతి,ప్రాంత, లింగ, భేదాలకు అతీతంగ వివిధ రకాల దృక్పధాలతో ఆచరిస్తున్న ఏకైక శాస్త్రీయీ సాంప్రదాయం ఈ పెళ్ళి. దీని మీద ఇంతమందికి ఇన్ని అభిప్రాయాలున్నపుడు, ఒక రచయతగా, ఒక దర్శకుడిగా నేను గమనించిన ఎందరో భర్తల సాక్షిగ, ఇంకందరో భార్యల సాక్షిగ నా అభిప్రాయమే ఈ“పెళ్ళి” ఎవరి కోసం? (P.S: Unity in diversity అనేది ఓ దేశానికి బాగుంటుందేమో కానీ ఓ కాపురానికి ఛండాలంగ ఉంటుంది) |